నూతనంగా ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం
కూకట్పల్లి ప్రశ్న ఆయుధం జూలై 23
కూకట్పల్లి నియోజకవర్గం, బాలానగర్,
బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్పొరేటర్ ఆవులు రవీందర్ రెడ్డి తో కలిసి బాలనగర్ డివిజన్ దిల్ ఖుష్ నగర్ లో ప్రభుత్వ పాఠశాలను ప్రారంభించారు… ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ కాలనీ వారి కోరిక మేరకు ఇక్కడున్న పిల్లలకి ఇబ్బంది కలక్కుండా ఈ ప్రాంతంలో స్కూలు ఏర్పాటు చేయడం జరిగిందని.. విద్యార్థులు కష్టపడి చదువుకుని తల్లిదండ్రులు ఆశయాలు నెరవేర్చాలని సూచించారు… తల్లితండ్రులు కూడా విద్యార్థులకు వారికున్న ఆసక్తిని గమనించి ఆయా పాఠశాలలో నైపుణ్యం పెంచే విధంగా ప్రోత్సహించాలని చదువు, క్రీడలు ,సాంస్కృతిక అన్ని రంగాల్లో కూడా విద్యార్థులు ముందుండేలా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకరించాలని తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఎంఈఓ హరీష్ చంద్ర.. ప్రధానోపాధ్యాయులు s.అరుణ జ్యోతి.. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు..