సేవాలాల్ సేన ప్రజా రగ్ జోళ్ యాత్ర కరపత్రాలు ఆవిష్కరణ

ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో సుజాతనగర్ బస్టాండ్ సెంటర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార ప్రతినిధి భానోత్ నాగరాజు నాయక్ అధ్యక్షతన సేవాలాల్ సేన రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీను నాయక్ చేతుల మీదన  ప్రజా రగ్ జోళ్ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది  శ్రీను నాయక్  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతగా నిర్వహించే ప్రజా రగ్ జోళ్ యాత్ర తొమ్మిది జిల్లాలలో చేపట్టడం జరిగింది అందులో భాగంగానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ మందిరం నుండి డిసెంబర్ ఎనిమిదోవ తారీఖున మొదలుకానుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల తండాల నుండి లంబాడి బిడ్డలు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రజా రగ్ జోళ్ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరారు. సేవాలాల్ సేన పోరాట ఫలితంగా సాధించుకున్న విజయాలు చాలా ఉన్నాయని అందులో గిరిజన తండాలను గుడాలను పంచాయతీలుగా సాధించుకోవడం జనాభా దామాస ప్రకారం ఆరు శాతం నుండి 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంపుదలతో కృషి చేయడం సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్* జయంతిని ఫిబ్రవరి 15న రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చేయడం అదేవిధంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించడంలో సేవాలాల్ సేన ముఖ్యపాత్ర పోషించిందని అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక డిమాండ్ల సాధన తో పాటు వివిధ సమస్యలు పరిష్కరించి గిరిజన జాతి పక్షాన నిలబడ్డ ఏకైక సంఘం సేవాలాల్ సేన అని చెప్పారు గిరిజన చట్టాలను కాలరాస్తూ ప్రభుత్వ పాలకులు వ్యూహాత్మకంగా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని గిరిజనులకు రాజ్యాంగంలో కల్పించిన చట్టాలను ఒక్కొక్కటిగా తుంగలో తొక్కుతూ గిరిజన రిజర్వేషన్లకు తూట్లు పొడిచే పనిలో నిమగ్నమయ్యారని అన్నారు ఈ నేపథ్యంలో సామాజికంగా రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ రంగాలలో గిరిజనులపై నిత్యం జరుగుతున్న భౌతిక దాడులను చూస్తుంటే గిరిజన జాతిని అణిచివేయుటకు బలమైన కుట్ర జరుగుతుందనేది అర్థమవుతుందని అన్నారు అందుకు మనకు మనమే రక్షించుకుంటూ గిరిజనుల పట్ల ప్రభుత్వ పాలకులు చూపిస్తున్న వివక్షతను ఎండగడుతూ గిరిజన చట్టాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గిరిజన మేధావులకు విద్యావంతులకు విజ్ఞప్తి చేశారు గత ఎన్నికలలో ప్రభుత్వ పాలకులు గెలువులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని రంగాలలో గిరిజనులకు రావాల్సిన హక్కులను పోరాడి సాధించుకునే దిశగా సెంట్రల్ కమిటీ ఆదేశానుసారం ప్రజలను చైతన్యం చేయుటకు మరెన్నో న్యాయమైన డిమాండ్లతో  ప్రజా రగ్ జోళ్ యాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా 15 కోట్ల బంజారా లు మాట్లాడే భాష గోర్ బోలిని భారత రాజ్యాంగం ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి అధికార భాషగా గుర్తించాలి ఐదో ఆరవ షెడ్యూల్లో గిరిజన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలి జీవో నెంబర్ 3ను పునర్దించి చట్టబద్ధత కల్పించాలి 100% అవకాశాలు ఏజెన్సీ గిరిజనులకు కల్పిస్తూ చట్టబద్ధత కల్పించాలి పోడు పట్టాలు రాని గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలి 20 ఎకరాలకు రైతు భరోసా పెంచాలి ప్రైవేట్ పరిశ్రమ రంగాలలో సమతా జడ్జిమెంట్ నిబంధనలు అమలు చేయాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలని అదేవిధంగా మన లంబాడి బిడ్డలు ఎదుర్కొంటున్న సమస్యలపై జరిగే  ప్రజా రగ్ జోళ్ యాత్ర ను విజయవంతం చేయవలసిందిగా కోరారు
ఈ కార్యక్రమంలో బంజారా విద్యార్థి సేన జిల్లా అధ్యక్షులు శ్రీను నాయక్, రామ్ లాల్ నాయక్, తిరుపతి నాయక్, రమేష్ నాయక్, సేవియా నాయక్, రాంబాబు నాయక్, వెంకటేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment