*సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా విమోచన చెందిన తెలంగాణ*
*జాతీయ జెండా ఆవిష్కరణ*
* బిజెపి మండలాధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి*
*జమ్మికుంట ఇల్లందకుంట ప్రశ్నఆయుధం సెప్టెంబర్ 17*
నిజం రాజు పరిపాలన నుండి తెలంగాణ ప్రజలు విముక్తి పొందడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా తెలంగాణ విమోచనను కలిగించారని బిజెపి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు తెలంగాణ విమోచన దినం 17 సెప్టెంబర్ పురస్కరించుకొని ఇల్లందకుంట మండల కేంద్రంలోని గరుడ చౌరస్తా వద్ద బిజెపి శ్రేణులతో కలిసి జాతీయ జెండా ఎగురవేశారు అనంతరం మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో నరేంద్ర మోడీ జన్మదినాన్ని వృద్ధుల సమక్షంలో కేక్ కోసి జరుపుకున్నారు అనంతరం విలేకరులతో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ బ్రిటిష్ పరిపాల నుండి భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేది రోజున స్వాతంత్రం వస్తే తెలంగాణ ప్రాంతానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పరిపాలన నుండి విముక్తి లభించిందని నిజాం రాజు పరిపాలనలో ఉన్న (హైదరాబాద్ సంస్థానం) ప్రాంతం రజాకార్ల రాక్షస పరిపాలనలో ఎన్నో ఇబ్బందులకు గురైందని ప్రాంత మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ఉండేదని తెలిపారు రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడి ఎంతోమంది అమరులయ్యారని దేశ హోం మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా నిజాం రాజును తలవంచిన ఈ ప్రాంతాన్ని దేశంలో విలీనం చేశాడని ఈ ప్రాంతానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన సర్దార్ పటేల్ ని ప్రతి ఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ముస్లిం మైనారిటీ ఓట్ల కోసం ఎంఐఎం కు భయపడి గతంలో కెసిఆర్ సర్కార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ అధికారికంగా తెలంగాణ విమోచన ఉత్సవాలు జరగకపోవడం దుర్మార్గమని అన్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బిజెపి అధికారం వచ్చిన తర్వాత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని భావితరాలకు తెలియజేయడం కోసం పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేరుస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రజా ప్రతినిధులు కంకణాల సురేందర్ రెడ్డి అంతం ఎల్లారెడ్డి ఎండి షఫీ ఖాన్ శక్తి కేంద్ర ఇన్చార్జులు గుత్తికొండ రాంబాబు జంగం సమ్మయ్య బూతు అధ్యక్షులు కలల సంజీవరెడ్డి సాయిరెడ్డి రమేష్ గురుకుంట్ల రమేష్ కొత్త శ్రీనివాస్ తాళ్ల పాపిరెడ్డి పల్లెర్ల శ్రీకాంత్ చెట్ల తిరుపతి కంకణాల భాస్కర్ రెడ్డి కమ్మగొని అజయ్ సాయికుమార్ వంశీ తదితరులు పాల్గొన్నారు