కెపిహెచ్బి కాలనీలో వారాహి సిల్క్స్ షోరూం ప్రారంభోత్సవం
ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 04: కూకట్‌పల్లి ప్రతినిధి
కూకట్పల్లిలో సినీ నటుడు నందమూరి బాల
కృష్ణ సందడి చేశారు. కెపిహెచ్బి కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి సిల్క్స్ షోరూంను ఆయన నటి మీనాక్షి చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం లో కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సాంప్రదాయ వస్త్ర షో రూమ్ ను విశాల వింతమైన నాలుగు అంతస్తుల లో సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారన్నారు. దేశంలోని పలు ప్రఖ్యాతిగాంచిన ప్రాంతాలలో నేసిన చీరలు కూడా షో రూమ్ లో అందుబాటులో ఉంచారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూం మేనేజింగ్ డైరెక్టర్ మణిదీప్ యేచూరి.. స్పందన మద్దుల లు పాల్గొన్నారు.