కమిషన్ రాక.. రేషన్ డీలర్ ల అవస్థలు

బ్రతుకులు భారంగా మారిన రేషన్ డీలర్ ల వ్యవస్థ ,,ప్రజా పంపిణీ లో తెలంగాణ రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా రేషన్ బియ్యం పంపిణీలో మొదటి స్థానంలో నిలిచింది . రేషన్ డీలర్లకు మే నుండి అక్టోబర్ నెల వరకు ఆరు నెలల కమిషన్ రాక రేషన్ డీలర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు . షాప్ రెంటు కట్టలేక ,కరెంటు బిల్లు కట్టలేక కుటుంబ పోషణ భారంగా ప్రతి ఒక్క డీలర్కు మారినది. ఇప్పటివరకు రాష్ట్ర నాయకులు దసరా వరకు ఆరునెల కమిషన్ వస్తాదని తెలుపడం జరిగినది. కానీ దసరాకు డబ్బులు రాలేవు. ఇంకొక ఐదు రోజులు అయితే దీపావళి కూడా పెద్ద పండుగ కాబట్టి దీపావళి వరకు డబ్బులు రాష్ట్ర నాయకులు వేపిస్తారని డీలల్రు ఆశిస్తున్నాము చేతిలో గవ్వలేక ప్రతి ఒక్క డీలరు బాధపడుతున్నందున ,మా యొక్క గ్రామీణ డీలర్ పరిస్థితులు పెద్ద మనసుతో అర్థం చేసుకొని మాకు తొందరగా కమిషన్ రిలీజ్ చేపిస్తారని ఆశిస్తున్నాము . రేషన్ డీలర్ అనేక ఇబ్బందులతో గోదాములో అమాలి కట్టలేక, షాప్ రెంట్ కట్టలేక, బియ్యము జోకినా వారికి డబ్బులు ఇవ్వలేక, నానా ఇబ్బందులు పడుతున్నందున మీరు ఇట్టి పరిస్థితులను పె

ద్ద మనసుతో అర్థం చేసుకొని డబ్బులు వేపిస్తారని మీ గ్రామీణ డీలరు పుల్లేని విట్టల్.

Join WhatsApp

Join Now

Leave a Comment