Site icon PRASHNA AYUDHAM

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచండి టి యు సి ఐ

సింగరేణిలో
Headlines:

వేతనాలు పెంచే విషయంలో జాప్యం వద్దు అన్నారు.

కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి టి యు సి ఇ టేకులపల్లి, సింగరేణి కె ఓసి ప్రాజెక్ట్ పిఓ కార్యాలయం ఆవరణలో కాంట్రాక్ట్ కార్మికుల మాస్టర్ అడ్డా వద్ద జరిగిన సమావేశంలో, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టియు సిఐ, యూనియన్ అనుబంధ సంస్థ ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్-(టియుసిఐ) రాష్ట్ర అధ్యక్షులు షేక్ యాకుబ్ షావలి పాల్గొని మాట్లాడుతూ

సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుల వేతనాలు 2017లో పెంచారని గత ఏడు సంవత్సరాల కాలంలో కార్మికుల జీతాలు పెంచలేదన్నారు. గత పది సంవత్సరాలు పరిపాలన చేసిన కేసీఆర్ గారు అన్ని రకాల కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచి సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులేరని అబద్ధాలు మాట్లాడిన కెసిఆర్ గారికి సింగరేణిలో తగిన గుణపాఠం కాంట్రాక్టు కార్మికులు చెప్పారన్నారు. ప్రజా పాలన అందిస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం కాలం కావస్తుంది, కాంట్రాక్ట్ కార్మికులందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేతనాలు పెంచుతారని గంపెడాశతో ఎదురుచూస్తున్నారని

కాలయాపన చేయకుండా వెంటనే సింగరేణిలో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్నారు, 2012 నవంబర్లో,8వ, వేతన ఒప్పందం చర్చల్లో, కోల్ ఇండియా వేతన ఒప్పందం హైపవర్ కమిటీ వేతనాలైనా, జీవో నెంబర్ 22 కు గెజిట్ చేసి వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో టేకులపల్లి ఏరియా కార్యదర్శి జలుపుల సుందర్ మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పాయం వెంకన్న ధ్రువ కుమార్ యాకూబ్ పాషా సైదులు వేణు రామ్ కుమార్, వెంకటేశ్వర్లు సత్యనారాయణ బాలు నరేష్ రవి రాజశేఖర్ పాల్గొన్నారు.

Exit mobile version