కళ్యాణదుర్గం
*పెంచిన విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించాలి*
*స్మార్ట్ మీటర్ల ఏర్పాటును*
*ఆదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలి*
*సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్*
విద్యుత్ సర్దుబాటు చార్జీలను తగ్గించి, తక్షణం స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ఉపసంహరించుకుని, ఆదానీతో జరిగిన విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గోపాల్ పట్టణ కార్యదర్శి ఓంకార్ డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు కళ్యాణదుర్గంలోని విద్యుత్ భవన్ దగ్గర జరిగిన నిరసన కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల కార్యదర్శి నాగరాజు నాయక్ తో కలిసి వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15485 కోట్ల విద్యుత్ సర్దుబాటు చార్జీలను ప్రజల పైన మోపిందని ప్రభుత్వం తక్షణం ఉపసంహరించుకోవాలని అన్నారు. ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి, ప్రభుత్వం గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని తీవ్రంగా నిరసించారు. అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్లు పగలగొడతామని ఎన్నికలలో ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చారని, అందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నాలుగు సార్లు