మొండి వీరన్న తండాలో స్వాతంత్ర్య వేడుకలు వైభవంగా

మొండి వీరన్న తండాలో స్వాతంత్ర్య వేడుకలు వైభవంగా

 

ఎన్నారై విట్టల్ నాయక్, గవర్నమెంట్ ఎంప్లాయి అనిల్ నాయక్ సేవా కార్యక్రమం

 

స్కూల్ హెచ్‌ఎం కేతావత్ అర్జున్, ఉపాధ్యాయులు కుశంగి బాలనర్సుకు అవసరమైన సదుపాయాలు అందజేత

 

తండ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో జాతీయ పతాక ఆవిష్కరణ

 

79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల మార్పిడి

 

విద్యాభివృద్ధిలో కలిసికట్టుగా ముందడుగు

 

తెలంగాణ స్టేట్ ఇంచార్జ్

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 15

 

 

కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మొండి వీరన్న తండాలో 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఎన్నారై విట్టల్ నాయక్, గవర్నమెంట్ ఎంప్లాయీ అనిల్ నాయక్ కలిసి స్కూల్ అభివృద్ధి కోసం ముందడుగు వేసి, ప్రధానోపాధ్యాయులు కేతావత్ అర్జున్, ఉపాధ్యాయుడు కుశంగి బాలనర్సుకు అవసరమైన వస్తువులు అందజేశారు. తండ పెద్దలు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్న ఈ వేడుకలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి స్వాతంత్ర దినోత్సవవేడుకలు జరుపుకున్నారు.

Join WhatsApp

Join Now