మెదక్/నార్సింగి, ఆగస్టు 15 (ప్రశ్న ఆయుధం న్యూస్):మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని కృషి విజ్ఞాన్ మోడల్ పాఠశాలలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించగా, కొందరు విద్యార్థులు దేశభక్తి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను స్మరించుకోవాలని, విద్యార్థులు వారి ఆలోచనలను అనుసరించి దేశాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా దేశభక్తి నృత్యాలు ప్రదర్శించి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. పాఠశాల ఆవరణ దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
నార్సింగి కృషి విజ్ఞాన్ మోడల్ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవం
Oplus_131072