స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు..

స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు..

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి జులై 10 ( ప్రశ్న ఆయుధం న్యూస్ ) దత్తి మహేశ్వరరావు

గుమ్మ లక్ష్మీపురం మండలం కేంద్రంలో అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు నిర్వహించిన ట్రైబల్ రైట్స్ ఫోరం నాయకులు.

ఈ సందర్భంగా ట్రైబల్ రైట్స్ ఫోరంరాష్ట్ర అధ్యక్షులు రొబ్బా లోవరాజు మాట్లాడుతూ

అతి చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేసి ఆదివాసీలందరినీ ఐక్యమత్యంగా ఒకటిగా చేస్తూ బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన గొప్ప స్వతంత్ర సమరయోధులను అని తెలియజేయడం జరిగింది.

ట్రైబల్ రైట్స్ ఫోరం జిల్లా అధ్యక్షులు ఇంటికుప్పల రామకృష్ణారావు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మన హక్కులు చట్టాల్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని అల్లూరి సీతారామరాజు లాంటి పోరాటమాస్పూర్తి ప్రతి ఒక్కరీలో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ యువతీ యువకులందరూ కూడా చెడు వ్యసనాలకు బానిసవకుండా ప్రతి ఒక్కరు బాగా చదివి మంచి స్థాయిలో నిలవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న ప్రజలు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now