*భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండబోతుంది*
*స్వామి శ్రీ శ్రీ సిద్ధ యోగి స్వామి చైతన్యానంద మహారాజ్*
*జమ్మికుంట మే 18 ప్రశ్న ఆయుధం*
సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తుగా ఉంటున్న దేశం భారతదేశం అని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ప్రతి దేశానికి ఆదర్శప్రాయంగా ఉంటున్న దేశం భారతదేశం అని త్వరలో భారతదేశం విశ్వగురు స్థానంలో ఉండబోతుందని స్వామి శ్రీ శ్రీ సిద్ధ యోగి స్వామి చైతన్యానంద మహారాజ్ అన్నారు జమ్మికుంట పట్టణంలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో శనివారం రాత్రి వరకు అంగరంగ వైభవంగా శ్రీరామ హనుమాన్ శోభాయాత్ర ఒగ్గు కళాకారులు, భరతనాట్యం, మహిళా కోలాటం, బోనాలు, మహిళా చప్పుల వాయిద్యాలు తో నిర్వహించగా జమ్మికుంట పట్టణ వర్తక సంఘం, సత్య సాయి సేవ సమితి, వాసవి వనిత క్లబ్ వివిధ సంస్థలు స్వాములకు భక్తుల కోసం మజ్జిగ, మంచినీరు, అరటి పండ్లు భక్తులకు స్వాములకు అందజేశారు శోభాయాత్రకు హాజరైన స్వామి శ్రీ శ్రీ సిద్దేయోగి స్వామి చైతన్య ఆనంద మహారాజ్ పాల్గొని మాట్లాడుతూ మన భారతదేశం విశ్వ గురువు స్థానంలో ఉండబోతుందని ఎందుకంటే మొన్న జరిగిన పలగామా దాడినీ చాలా చాకచక్యంగా మన ప్రధానమంత్రి తిప్పికొట్టాడని మనందరం కలిసి పాకిస్తాన్ స్మశానంగా మార్చాలని ఇలాంటి యాత్రలు మనం చాలా నిర్వహిస్తే నా ప్రభుత్వాలు మనం ఇచ్చే స్ఫూర్తితో ముందుకు నడుస్తాయని దానికి ప్రతి హనుమాన్ మాలధారణ సమయంలో కాకుండా నిత్యం హనుమాన్ స్వాముల భారతదేశాన్ని కీర్తించాలని అన్నారు
ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు ఆకుల రాజేందర్, కార్యక్రమం కో కన్వీనర్ పొన్నగంటి రవి(పీజేఆర్ ) వివిధ ఆలయాల ప్రతినిధులు పొన్నగంటి మల్లయ్య, కర్ర సుబ్బారావు, సిరిమల్లె జయేందర్, పొన్నగంటి సంపత్ ,సామల ప్రతాప్ రెడ్డి, ముదిగంటి ప్రకాష్ రెడ్డి, ఆకుల రాజయ్య, కొండ్ల పాపయ్య,బచ్చు శివన్న, శిల జయప్రకాష్, ఉడుగుల మహేందర్, మురికి మహేష్, కొండ్ల నగేష్, ఎడ్ల రాజేందర్, మామిడి ఐలయ్య, పాన్తాటి రవీందర్, ఏబూసి శ్రీనివాస్ , టంగుటూరి రాజ్ కుమార్, బిజెపి నాయకులు కోలకాని రాజు, సంపెల్లి సంపత్ రావు, పుప్పాల రఘు, శీలం శ్రీనివాస్, శ్రీరామ్ శ్యామ్, ఎగ్గని చందు, కైలాస కొట్టి గణేష్, చిర్యాల విజయ్, కాంగ్రెస్ నాయకులు సాయిని రవి మరియు పాకాల రవీందర్ రెడ్డి, చిదురాల భాస్కర్, చీరాల శ్రీనివాస్, ఆరెల్లి శ్రీనివాస్ తోపాటు వేలాదిమంది భక్తులు తదితరులు పాల్గొన్నారు