భారతదేశ వారసత్వ సంపద విశిష్టమైనది

*భారతదేశ వారసత్వ సంపద విశిష్టమైనది*

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 25 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి తారా ప్రభుత్వ కళాశాలలో చరిత్ర విభాగం, యువ టూరిజం క్లబ్, ఎన్ఎస్ఎస్, సామాజిక శాస్త్ర విభాగాల ఆధ్వర్యంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలలో భాగంగా కళాశాలలో జరిగిన వివిధ కార్యక్రమలలో భాగంగా సోమవారం భారతదేశ వారసత్వ సంపద – దాని విశిష్టత అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎస్.ఎస్.రత్నప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగారెడ్డిలోని మహిళా డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకురాలు డాక్టర్ శాంత వేణి మాట్లాడుతూ.. ప్రపంచ వారసత్వ సంపదలో కెల్లా భారత దేశ వారసత్వ సంపద విశిష్టమైనదని అన్నారు. తన ప్రసంగంలో జైన, బౌద్ధ, హిందూ మతాలలోని సాహిత్యం యొక్క ఔన్నత్యాన్ని తెలుపుతూ, మన యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని చర్చలు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాల ద్వారా మనమే రక్షించుకోవాలని, ఇవి మన జీవన విధానాన్ని తెలుపుతాయని తెలిపారు. అందుకే ప్రపంచానికి నాగరికతను నేర్పిన దేశం, సంస్కృతి, సాహిత్యాలు, విజ్ఞాన సంపదను అందించిన దేశము భారతదేశమే అని అన్నారు. మనదేశంలో భారతము, రామాయణము, భగవద్గీతలే కాకుండా జైన, బౌద్ధ మత గ్రంథాలు కూడా మానవతా విలువలకి ప్రతిరూపాలని తెలిపారు. అందుకే మనము మన వారసత్వ సంపద, సాంస్కృతిక సంపదను ఆకలింపు చేసుకొని, రక్షించుకొంటూ భవిష్యత్తు తరాలకు అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆశావాహ దృక్పథాన్ని కలిగి ఉంటే దేనినైనా సాధించవచ్చునని, విద్యార్థులు ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుని లక్ష్యాన్ని నిర్ధారించుకుని దానికనుకూలంగా కృషి చేస్తే లక్ష సాధన సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన మహిళా డిగ్రీ కళాశాల గణిత శాస్త్ర అధ్యాపకులు డాక్టర్ పి. రామిరెడ్డి భారతదేశ వారసత్వ సంపద యొక్క ఔన్నత్యాన్ని, ప్రపంచంలో దాని విశిష్టతను తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీశ్వర్, చరిత్ర విభాగాధిపతి డాక్టర్ వాణి, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ జోష్ణ, ఇతర అధ్యాపక బృందము తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment