ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన సదస్సు
ట్రాఫిక్ రూల్స్ పాటించాలి
మైనార్లకు వాహనాలు ఇవ్వకూడదు
అతివేగం ప్రమాదానికి సూచిక
— ట్రాఫిక్ ఎస్ఐ మధు ప్రసాద్
భద్రాచలం: బీసీ బాలికల వసతి గృహం నందు వెనుకబడిన తరగతుల వసతి గృహ విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారి ఇందిరా ఆధ్వర్యంలో భద్రాచలం ట్రాఫిక్ రూల్స్ పై ఎస్సై మధు ప్రసాద్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్మెంట్ సీట్ బెల్ట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవచ్చని దాని వలన మన ప్రాణాలు సురక్షితంగా క్షేమంగా ఉంటారని మనకోసం ఇంట్లో కుటుంబం ఎదురుచూస్తూ ఉంటుంది మీరు అర్థం చేసుకొని ఇతరులకు కూడా మీ కుటుంబ సభ్యులకు కూడా దీనిమీద అవగాహన కల్పించాలని ఎస్ఐ మధు ప్రసాద్ సూచించారు. వాహనాలు అతివేగంగా నడపరాదని మరి ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలని దీనివలన ప్రాణాపాయస్థితి ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, రమేష్ వసతి గృహ సంక్షేమ అధికారులు నరసింహారావు, అపర్ణ, అరుణ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.