ఇందిరా మహిళా శక్తి సంబురాలు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ (ప్రశ్న ఆయుధం):08 ఇందిరా మహిళ వారోత్సవాల సందర్భంగా ఎంపీడీవో ఆధ్వర్యంలో మండల సమైక్య ఏపిఎం అన్ని వివోల నుండి వచ్చిన అధ్యక్షురాలు వివోఏలు మరియు సీసీలు మండల సమైక్య సిబ్బంది సమావేశానికి హాజరు కావడం జరిగింది . ఇట్టి సమావేశంలో గత సంవత్సరము సాధించినటువంటి అన్ని రకాల పనులలో ప్రగతిని అదేవిధంగా 2025 26 సంవత్సరానికి సాధించబోయే ప్రగతిని ఏపిఎమ్ సభ్యులకు తెలియజేయడం జరిగినది అదేవిధంగా ఎంపీడీవో మాట్లాడుతూ మహిళలు అన్ని రకాల ప్రభుత్వ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని చెప్పడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో మండలంలో వరి కొనుగోలు కేంద్రాలలో ఎక్కువగా వడ్లను కొనుగోలు చేసినటువంటి కొమలించ గ్రామ సంఘానికి కమిటీ సభ్యులకు సిబ్బందికి మండల సమైక్య తరఫున సత్కరించడం జరిగినది అదేవిధంగా 2025 సంవత్సరంలో ఎక్కువ ఆదాయం పొందినటువంటి మల్లూరు మమ్మద్ నగర్ టు గ్రామ సంఘాలకు సంబంధించిన వివోఏలకు శాలువాలతో సన్మానం చేయడం జరిగినది మరియు గత సంవత్సరము ఈ సంవత్సరము ఏకరూప దుస్తులు కుట్టినటువంటి మహిళా సభ్యురాలకు సన్మానం చేయడం జరిగినది మరియు ఈ వారోత్సవాలలో భాగంగా మహిళా సంఘాలను వృద్ధ సంఘాలను,దివ్యాంగుల సంఘాలను ఏర్పాటు చేయాలని మండల సమాఖ్య అధ్యక్షురాలు మాట్లాడడం జరిగినది