ఘనంగా ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

గాంధీ
Headlines in Telugu:
  1. వీణవంకలో ఇందిరా గాంధీ సేవలను స్మరించిన కాంగ్రెస్ నేతలు
  2. గరీబి హటావో నినాదంతో పేదల గుండెల్లో నిలిచిన ఇందిరమ్మ
  3. మహిళా సంక్షేమానికి ప్రధాని ఇందిరా గాంధీ చూపిన మార్గం
  4. రైతులకు, పేదలకు గొప్ప నాయకురాలు ఇందిరమ్మ: వీణవంక కాంగ్రెస్
  5. మండల కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్న ఇందిరా జయంతి

*వీణవంక నవంబర్ 19 ప్రశ్న ఆయుధం*

మంగళవారం రోజున కరీంనగర్ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండీ సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా మూడు పర్యాయాలు ప్రధానిగా సేవలు అందించి ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు వారి హయాంలో గరీబి హటావో నినాదం తో,20 సూత్రాల పథకం పేదలకు అసైన్ భూములు పంపిణీ హరిత విప్లవం పాకిస్తాన్ పై యుద్ధం గెలిచి దేశ ప్రజల మన్ననలు పొందారని వారిని స్ఫూర్తిగా తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రు.500 లకే గ్యాస్ సిలిండర్ , రైతులకు సన్న వడ్ల బోనస్, ఇందిర మహా శక్తి కార్యక్రమాలతో మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గంగాడి రాజిరెడ్డి, జిన్నుతుల మధుకర్ రెడ్డి, ఈదునూరి పైడి కుమార్, గొట్టే రాజయ్య, మద్దుల ప్రశాంత్ దూడపాక రాజ కొమురయ్య గెల్లు కొమురయ్య బండారి లక్ష్మణ్ తాళ్ల పెళ్లి సురేష్, కొలిపాక మల్లయ్య, మాజీ సర్పంచ్ లు కర్ర తిరుపతి రెడ్డి, చిన్నాల ఐలయ్య, దాసారపు లక్ష్మణ్, నూతన మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కామెడీ శ్రీపతి రెడ్డి, ఎండి రషీద్, మాదాసు సునీల్, నల్లగోని సతీష్,తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment