సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబరు 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): గుమ్మడిదల మండలం కొత్తపల్లి గ్రామంలో భారతరత్న, దేశ ప్రగతికి మార్గదర్శకురాలు ఇందిరా గాంధీ జయంతి సందర్బంగా నాయకులు ఆమె విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… భారతదేశ తొలి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ దేశ అభివృద్ధి కోసం రాత్రి పగలు కృషి చేశారని, గరీబ్ హటావో నినాదంతో పేద ప్రజలకు న్యాయం చేసిన మహా నాయకురాలిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు చాకలి చంద్రయ్య, తాజా మాజీ ఉప సర్పంచ్ విజయ్ కుమార్, కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు లింగయ్యగారి హనుమంత్ రెడ్డి, తాజా మాజీ వార్డు సభ్యులు గాలి మల్లేశం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆగం రాజు, నీరుడి నర్సింలు, నీరుడి నాగేష్, నీరుడి మల్లేశం, నీరుడి కృష్ణ, మన్నె ఆంజనేయులు, కొక్కొండ నవీన్, కొక్కొండ సురేష్, కొక్కొండ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తపల్లిలో ఘనంగా ఇందిరా గాంధీ జయంతి
Updated On: November 19, 2025 8:36 pm