దేశ రైతు, పేదల మనసుల్లో చిరస్మరణీయ నాయకురాలు ఇందిరా గాంధీ: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారతదేశ రాజకీయ చరిత్రలో అజరామరమైన నాయకురాలు, దేశ ప్రజల కోసం త్యాగం చేసిన వీరనారి ఇందిరా గాంధీ అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇందిరా గాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. “దేశ రైతులకు, పేదలకు బ్యాంకులను చేరువ చేసిన గొప్ప లీడర్ ఇందిరా గాంధీ అని, కులమతాలకు అతీతంగా పేద ప్రజలకు భూములు పంచిన ఘనత ఆమెదే. బలై పోతానని తెలిసినా.. దేశ ప్రయోజనాల కోసం కఠిన నిర్ణయాలు తీసుకున్న ధైర్యవంతురాలు ఇందిరా గాంధీ అని అన్నారు. “బ్యాంకులను జాతీయ ఆస్తులుగా మార్చి, గ్రామీణ స్థాయిలో బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని ఇందిరా గాంధీ అని, బ్యాంక్‌ల జాతీయీకరణతో రైతులు, పేదలు ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములయ్యారని తెలిపారు ల్యాండ్ సీలింగ్ చట్టం ద్వారా భూమిలేని పేదలకు భూములు పంచిందని, ఇంటి స్థలం లేని పేదలకు ఇందిరమ్మ జాగాలు ఇచ్చిన ఘనత ఆమెకే దక్కిందని, అందుకే దేశ ప్రజలు ఇప్పటికీ ఆమెను కృతజ్ఞతతో స్మరించుకుంటున్నారుని అన్నారు. ఇందిరా గాంధీ హత్య చేయబడిన రోజు దేశం మొత్తం చీకటిలో మునిగిపోయిందను, రక్తపు మడుగులో పడి ఉన్న ఇందిరా గాంధీ పక్కన సోనియా గాంధీ ఉన్నారని, ఆ దృశ్యం దేశ చరిత్రలో మరువలేనిదిని తెలిపారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు భారత రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న అటల్ బిహారీ వాజ్‌పేయీ కూడా ఇందిరా గాంధీని గొప్ప నాయకురాలిగా కొనియాడారని, ఆ కుటుంబం దేశం కోసం త్యాగాలు చేసినప్పుడు, నేటి మోడీ, అమిత్ షా, కేసీఆర్ లాంటి నాయకులు ఎక్కడ ఉన్నారు..? ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబం త్యాగాలు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment