తాడ్కోల్ చౌరస్తా లో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు
ప్రశ్న ఆయుధం 31 అక్టోబర్ (బాన్సువాడ ప్రతినిధి)
బాన్సువాడ పట్టణంలోని ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా నేడు ఇందిరాగాంధీ విగ్రహాన్ని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ చేసినటువంటి పచ్చ విప్లవం,బ్యాంకుల జాతీయకరణ, పోక్రాన్ అనుపరీక్ష, విదేశాంగంలో నాయకత్వం, విజ్ఞాన విద్య అభివృద్ధి దేశ భద్రతకు సంబంధించి అనేక విధాలుగా దేశ అభివృద్ధికి గరీబీ హటావో అనే నినాదంతో ముందుకు సాగారు.దేశం కోసం ప్రాణాలు అర్పించరాని కొనియాడారు.వారిని గుర్తుంచుకున్నారు ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపాల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు అమర్ చౌస్,హకీమ్ కిరణ్ వెంకటేష్ ,కట్కా రమేష్ నాయకులు సయ్యద్ గౌస్, కనుకుట్ల రాజు,రవి,తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.