ఇందిరమ్మ ఇళ్ల పథకం: లబ్ధిదారుల ఎంపిక

*ఇందిరమ్మ ఇళ్ల పథకం: లబ్ధిదారుల ఎంపిక*

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 21

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నాగారం మున్సిపాలిటీ పరిధిలోని విజయపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో 9వ వార్డు ఇందిరమ్మ కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్‌పర్సన్ శ్రీమతి కోమిరెల్లి అనిత సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఖాళీ స్థలం ఉండి, గృహ నిర్మాణానికి అర్హులైన పేదలను గుర్తించి ఎంపిక చేశారు.

ఈ సందర్భంగా కమిటీ చైర్‌పర్సన్ మాట్లాడుతూ, సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ముప్పు శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొమీరెల్లి సుధాకర్ రెడ్డి, దాసరి రాంరెడ్డి, మాదిరెడ్డి రాజిరెడ్డి, వార్డ్ ఆఫీసర్ లక్ష్మి, బిల్ కలెక్టర్ బిక్షపతి, కమిటీ సభ్యులు చంద్రశేఖర్, దాసరి విజయలక్ష్మి, పంజాల జయమ్మ, కాలనీ వాసులు చండీ శ్రీనివాస్, ప్రభాకర్ రెడ్డి, పంజాల నరసింహా గౌడ్, కిషన్ నాయక్, జ్ఞానేశ్వరి, ఎల్లేష్ గౌడ్, విశాల, సత్యనారాయణ ప్రసాద్, వివేక్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now