ఇందిరమ్మ ఇళ్లు ఇప్పట్లో లేనట్టేనా?
తాము రూపొందించిన యాప్ లోనే సర్వే చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని రీ-సర్వే చేయమని కోరిన కేంద్ర ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్ల అర్హుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం భారీ షాక్
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రామసభల ద్వారా దరఖాస్తులు సేకరించినా, తాము రూపొందించిన మొబైల్ యాప్ ద్వారా సర్వే చేస్తేనే నిధులు ఇస్తామని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం
ఇప్పటికే జనాల్లో నమ్మకం కోల్పోతున్నామని, మళ్ళీ అన్ని లక్షల మందికి రీ-సర్వే చేయాలంటే ప్రజల్లో మాపై నమ్మకం పూర్తిగా పోతుందని వాపోయిన రాష్ట్ర ప్రభుత్వం
దీంతో ఇందిరమ్మ ఇళ్ల భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వంపైన పడనుంది. కానీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో తాము అన్ని ఇందిరమ్మ ఇళ్లు ఎలా కట్టాలని అయోమయంలో పడ్డ రేవంత్ సర్కార్