స్లమ్‌లలో నివసించే వారికి పక్కా ఇండిరమ్మ ఇళ్లు – జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ఆదేశాలు

**స్లమ్‌లలో నివసించే వారికి పక్కా ఇండిరమ్మ ఇళ్లు – జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా ఆదేశాలు**

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూన్ 11

ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న నిరుపేదలకు పక్కా ఇండిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ముందడుగు వేస్తూ, జిల్లా అదనపు కలెక్టర్ రాధికా గుప్తా కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని విజయవంతంగా అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

సర్వే ప్రక్రియలో తహాసీల్దార్లు మరియు మున్సిపల్ కమిషనర్లు పరస్పరం సమన్వయంతో పనిచేయాలని సూచించిన అదనపు కలెక్టర్, శిథిలావస్థలో ఉన్న మరియు ఇరుకుగా నిర్మిత ఇళ్లను పునరాభివృద్ధి చేసేందుకు స్థలాలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు.

జిల్లాలోని ప్రతి మున్సిపాలిటీలోని వార్డుల్లో ఉన్న మురికివాడల వివరాలను అడిగి తెలుసుకున్న రాధికా గుప్తా, ఈ నెల 13వ తేదీలోగా నివేదికలు సమర్పించాలని అధికారులకు గడువు విధించారు. ప్రజలను ఒప్పించడం, వారి సమ్మతిని పొందడం కోసం స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని సూచించారు.

“భవిష్యత్తులో అన్ని మురికివాడల నివాసితులకు గౌరవప్రదమైన జీవనం, అన్ని మౌలిక వసతులతో కూడిన పక్కా గృహాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యం” అని ఆమె స్పష్టంచేశారు.

ఈ సమావేశంలో హౌసింగ్ ఈఈ రమణమూర్తి, వివిధ మండలాల తహాసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment