దమ్మాయిగూడలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ ఘనంగా

**దమ్మాయిగూడలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ ఘనంగా**

మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ ప్రశ్న ఆయుధం జూన్ 10

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కింద మేడ్చల్ నియోజకవర్గంలోని దమ్మాయిగూడ మున్సిపాలిటీ, కీసర ప్రాంతాల్లో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ చేరాలన్నదే తమ పార్టీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు ముప్పు రామరావు, కీసర మాడల్ అధ్యక్షులు కృష్ణ యాదవ్, విజయ్ రెడ్డి, పన్నాల శ్రీనివాస్ రెడ్డి, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.భూమిపూజ సందర్భంగా లబ్ధిదారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, తమకంటూ ఓ ఇంటి కలను సాకారం చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పథకం అమలుతో అనేక మంది పేద కుటుంబాలకు ఊరటనిచ్చే అవకాశముందని వారు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment