ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి – కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి – కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

 

లబ్ధిదారులు గృహప్రవేశం చేసుకునేలా త్వరితగతిన నిర్మాణం పూర్తి చేయాలి

 

చిట్యాల గ్రామంలో మమత ఇంటి నిర్మాణం పరిశీలన

 

32 ఇండ్లలో 12 ఇండ్లకు మార్కౌట్ – నాలుగు ఇండ్లు నిర్మాణ దశలో

 

ఇసుక సరఫరా సకాలంలో ఉండాలని కలెక్టర్ ఆదేశం

 

ధరలు నియంత్రణలో ఉంచాలని మండల అధికారులకు సూచనలు

 

కామారెడ్డి జిల్లా ఇంచార్జీ

(ప్రశ్న ఆయుధం) ఆగస్టు 20

 

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.

బుధవారం తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో ఇందిరమ్మ లబ్ధిదారు మమత నిర్మిస్తున్న ఇంటిని పరిశీలించిన కలెక్టర్, త్వరగా ఇంటి పనులు పూర్తి చేసి గృహప్రవేశం చేసుకోవాలని సూచించారు. ఈ గ్రామంలో 32 ఇండ్లు మంజూరవగా, 12 ఇండ్లకు మార్కౌట్ ఇచ్చి, వాటిలో మూడు బేస్మెంట్, ఒక ఇల్లు రూఫ్ లెవెల్ వరకు నిర్మాణం సాగిందని తెలిపారు.

ముహూర్తాలు అనుకూలంగా ఉన్నందున మిగతా లబ్ధిదారులు కూడా తక్షణమే పనులు ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక సరఫరా ఎలాంటి కొరత లేకుండా ఉండాలని, హౌసింగ్ వస్తువుల ధరలను మండల స్థాయి అధికారుల కమిటీ కంట్రోల్లో ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

తర్వాత సంతాయిపేట గ్రామంలో ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించిన కలెక్టర్, అధికారులు దగ్గరుండి పనులను పర్యవేక్షించి, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్, ఎంపీడీవో సాజిద్ అలీ, తాసిల్దార్, ఎంపీవో తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now