ఇదిగో ఇల్లు, ఇదిగో ఇల్లు అంటూ పేదల బతుకులతో ఆడుకుంటున్న కాంగ్రెస్ సర్కార్*
*మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర భావ్ సింగ్ నాయక్*
ప్రశ్న ఆయుధం న్యూస్ ఫిబ్రవరి 2 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి
కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట తప్పడం అలవాటుగా చేసుకుందో లేకపోతే రాష్ట్ర ప్రజలను అమాయక ప్రజలను మోసం చేయడం తన ధ్యేయంగా పెట్టుకుందో తెలియదు కానీ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ప్రజా పాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించి ఇందిరమ్మ ఇళ్లకు మోక్షం కల్పిస్తుందని చెప్పి దాని తర్వాత గ్రామాలలో గ్రామపంచాయతీలలో స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో కలిసి ఇందిరమ్మ కమిటీలను వేసి అధికారులతో కూడా సర్వే చేయించి ఆ యొక్క లబ్ధిదారులను గ్రామసభలలో ప్రకటించిన తర్వాత మళ్లీ ఇప్పుడు మరలా రీ సర్వే చేసిన తర్వాతే ఇందిరమ్మ ఇల్లు ప్రకటిస్తామనడం హాస్యాస్పదంతో పాటు అమాయక ప్రజలను ఆశ్చర్యాన్ని గురి చేస్తుందని ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీర భావ్ సింగ్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు జిల్లా కలెక్టర్ ఇందిరమ్మ లబ్ధిదారులు ఎంపిక కోసం ప్రభుత్వం మరోసారి సర్వే చేపట్టడం జరుగుతుందని ప్రకటించడంతో వారు మండిపడ్డారు. ఒకసారి ప్రజాపాలన మరోసారి ప్రజాప్రతినిధులతో ఇందిరమ్మ కమిటీలు మరల ఇప్పుడు ఆ రెండు కమిటీలు సరిపోక మరోసారి సర్వే చేపట్టాలి అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మాట తప్పడం మాట మార్చి ప్రజలను ఏ మార్చడం కాంగ్రెస్ పార్టీ తన అలవాటుగా చేసుకుందని ఏ యొక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తిగా అందించకుండా ఇటువంటి మాట తప్పే ధోరణితో కాలం వెళ్ళబుచుతూ అమాయక ప్రజలను మోసం చేస్తుందని అన్నారు. ఎన్నో రకాల అమలకు సాధ్యం కానీ హామీలను ప్రకటించి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ ప్రజలను సర్వేల పేరుతో పిచ్చివాళ్లను చేస్తుందని, మొన్నటి ఇందిరమ్మ కమిటీలో లబ్ధిదారుల ఎంపిక జరిగిన తర్వాత మరల సర్వే జరుగుతుందనడంతో గ్రామసభలలో ఎంపికైన లబ్ధిదారులలో ఆందోళన వ్యక్తం అవుతుందని అన్నారు. ఏది ఏమైనా రేవంత్ సర్కార్ ప్రజలను సంక్షేమ పథకాల పేరుతో మసి పూసి మారేడు కాయ చేస్తుందని దుయ్యబట్టారు. ఇదే వైఖరి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చరమగీతం పాడక తప్పదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ అజ్మీర భావ్ సింగ్ నాయక్ తో పాటు,గూగుల్ సోమన్న,బుక్య రాంజీ ,జలపుల మోతిలాల్, బానోత్ భద్రమ్మ, దరం సోద్ లక్ష్మి పాల్గొన్నారు.
కాలయాపన కే పరిమితమవుతున్న ఇందిరమ్మ ఇండ్లు
by Naddi Sai
Published On: February 2, 2025 9:54 pm
