*”ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుంది” – మేడ్చల్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్*
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం జూలై 18
సొంత ఇల్లు కలిగి ఉండాలనే ప్రతి పేదవాడి ఆశయాన్ని నెరవేర్చే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం “ఇందిరమ్మ ఇళ్ల పథకం”ను ముందుకు తీసుకెళ్తోందని మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు.
శుక్రవారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్‌లలో వజ్రేష్ యాదవ్ పర్యటించి, ఇందిరమ్మ ఇళ్ల స్థితిగతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయనతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తుంగతుర్తి రవి, మాజీ మేయర్ అమర్ సింగ్, మాజీ డిప్యూటీ మేయర్ శివ గౌడ్, మాజీ గ్రంథాలయం చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కనకదుర్గ, మాజీ కార్పొరేటర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు, యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని పథకం అమలుపై సమీక్షించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిస్సహాయులకు రుణ భారం లేకుండానే సొంత ఇల్లు లభిస్తుందని వజ్రేష్ యాదవ్ పేర్కొన్నారు. పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబాటు స్పష్టంగా కనిపిస్తోందని, ఈ పథకం కొనసాగింపుతో లక్షల మంది పేదలకు ఊరట కలుగుతోందని ఆయన అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల సొంతింటి కలను నెరవేరుస్తుంది” – మేడ్చల్ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్
by Madda Anil
Published On: July 18, 2025 9:16 pm