సంగారెడ్డి, డిసెంబర్ 22 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండలం ఇంద్రకరణ్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామ సర్పంచ్‌గా శంకరి రాజు, ఉప సర్పంచ్‌గా కొన్యాల శ్రావణి రాజేందర్ రెడ్డిలను ప్రత్యేక అధికారి మహేందర్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ వాణి ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే వార్డు సభ్యులు శ్రీకాంత్, లక్ష్మి, సుశీల, వేంకటేశం, జైపాల్, అనూష, సామెల్, యాదయ్య, మల్లేశం, ప్రభుగౌడ్, రత్నమ్మలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ శంకరి రాజు మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న తాగునీరు, రహదారులు, పారిశుధ్యం తదితర సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఇంద్రకరణ్ గ్రామ పాలకవర్గం ప్రమాణ స్వీకారం
Oplus_16908288