మంతూరు పాఠశాలలో మౌలిక సౌకర్యాలు: మాజీ సర్పంచ్ సత్తార్ పటేల్

సంగారెడ్డి, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): పుల్కల్ మండలంలోని మంతూరు గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన మౌలిక సౌకర్యాలను కల్పించామని ఆ గ్రామ మాజీ సర్పంచ్ సత్తార్ పటేల్ తెలిపారు. పాఠశాల మరమ్మత్తుకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను కాజేశారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తమన్నారు. పాఠశాల మరమతుల కోసం అమ్మ పాఠశాల పథకం కింద రూ.8 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఆ మేరకు పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థమై తాగునీటికి కుళాయిలు, మరుగుదొడ్లు, టాయిలెట్స్, పాఠశాల గదులకు రంగులు, విద్యుత్ సౌకర్యంతో పాటు విద్యార్థుల కోసం మంచినీటి అవసరాలకు 150 మీటర్ల పైప్ లైన్ ను ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు సంబంధించి రూ.4 లక్షల బిల్లు మంజూరు చేశారని, మరో రూ.4 లక్షలు బిల్లు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. అలాగే, రాయిపాహాడ్ నుండి మంతూరు వరకు రోడ్డు ఏర్పాటు నిధులు మంజూరు లేనప్పటికి ఆ నిధులను కాజేశారంటూ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణ రోడ్లకు నయా పైసా నిధులు మంజూరు చేయలేదని, మంజూరు లేని నిధులను స్వాహా చేశారంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ సర్పంచ్ సత్తార్ పటేల్ ఖండించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment