ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలి జిల్లా కలెక్టర్..

కొనుగోలు
Headlines (Telugu)
  1. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలి: జిల్లా కలెక్టర్
  2. రైతులకు ప్యాడి క్లీనర్స్ మరియు తదితర ఏర్పాట్లు
  3. 423 ధాన్యం కొనుగోలు కేంద్రాలు జిల్లాలో ఏర్పాటు
  4. సభ్యులతో జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశం
  5. కూలీ గడులు, ధాన్యం కొనుగోలు మరియు మార్కెటింగ్ అంశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం నవంబర్ 04:

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు అందుబాటులో ప్యాడి క్లీనర్స్, తదితర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం రోజున తన క్యాంప్ కార్యాలయంలో పౌరసరఫరాలు, వ్యవసాయం, మార్కెటింగ్, గ్రామీణాభవృద్ధి, తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 423 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని కేంద్రాల్లో రైతుల కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు. ప్రతీ కేంద్రంలో ప్యాడి క్లీనర్స్, టార్పాలిన్స్, తూకం మిషన్లు, తదితర సౌకర్యాలు కల్పించాలని అన్నారు. సన్నవడ్లు, దొడ్డు వడ్లు విడివిడిగా కొనుగోళ్లు చేయాలని అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం ను లారీల్లో టాగింగ్ చేసిన రైస్ మిల్లులకు తరలించాలని అన్నారు. సి.ఏం.ఆర్. చేయని రైస్ మిల్లర్ల పై చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో ఉన్న హార్వెస్టర్స్ తో పంటలు కోత చేసే సమయంలో డ్రైవర్స్ కు పలు జాగ్రత్తలు తెలియజేయాలని సూచించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి.విక్టర్, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాజేందర్, ఇన్చార్జి జిల్లా పౌర సరఫరాల అధికారి నరసింహ రావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆర్. తిరుమల ప్రసాద్, జిల్లా సహకార అధికారి రాం మోహన్, జిల్లా మార్కెటింగ్ అధికారిని రమ్య, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ లు, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now