ఎంపి నిధులతో వేసిన బోరుబావి ప్రారంభం
శంకరపట్నం అక్టోబర్ 25 ప్రశ్న ఆయుధం
శంకరపట్నం మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో ఎంపీ నిధుల నుండి వేసిన బోరుబావిని మండల వైద్యాధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం బిజెపి మండల అధ్యక్షులు ఎనుగుల అనిల్ ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేసి హస్పటల్ కు వస్తున్న రోగుల అవసరం నిమిత్తం కోరగానే బోర్ వేయించిన బండి సంజయ్ కుమార్ కు మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి, నాయకులు జంగ జైపాల్, దాసరపు నరేందర్, కొయ్యడ అశోక్, రాసమల శ్రీనివాస్, బిజిలి సారయ్య, కనకం సాగర్, పడాల వెంకటలక్ష్మి, బొజ్జ సాయి ప్రకాష్, గూళ్ల రాజు, తోట అనిల్, పంజాల అనిల్, గొల్లిపెల్లి వెంకటేశం, నర్సయ్య, తాడవేణి రవి, సంపత్ లతో పాటు సుపర్వేజర్ అనిల్, ఏ.ఎన్.ఎం. శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.