దళితులకు తీరని అన్యాయం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలకు తీరని అన్యాయం జరిగింది, న్యాయం చేయాలని డిమాండ్
నేటి నుండి తెలంగాణ రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల అభివృద్ధిపై ప్రస్తావించి న్యాయం చేయాలని ప్రజా పాలన ప్రభుత్వన్ని కోరారు
ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్సి జూలై 22
కొత్తగూడెం సింగరేణి ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల కార్యాలయంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి సమావేశం సోమవారం జరిగింది. సమావేశానికి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
పాలన సౌలభ్యం కోసం ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతం పేరుతో ఎస్సీ కులాలను ప్రభుత్వాలు అభివృద్ధిపై వివక్షత చూపుతున్నారని ఖండించారు.
ముఖ్యంగా రాజ్యాంగపరమైన హక్కు ఎస్సీ కులాలకు అభివృద్ధి లో వాటా, అధికారంలో వాటా కోల్పోయిన ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలను గుర్తించి జడ్పిటిసి, ఎంపిటిసి, వార్డు సభ్యుల రిజర్వేషన్ గతంలో మాదిరిగా ప్రజాపాలన ప్రభుత్వం కొనసాగించాలని కోరారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతం లక్షలాదిమంది తరపున ఇప్పటిదాకా ఒక్క ప్రజా ప్రతినిధి లేనందున నామినేట్ పదవులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో సుమారు సగ భూభాగం ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ మహబూబ్నగర్ నాలుగు జిల్లాలు ఇప్పుడు విభజించిన తర్వాత పది జిల్లాలు 96 మండలాలు 15 లక్షల పైన జనాభా కలిగిన ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల పక్షాన ప్రస్తావించడానికి ఒక్క ప్రజా ప్రతినిధి లేడు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలు ప్రభుత్వం దృష్టిలో రాజ్యాంగ పరిధిలో ఉన్నారా లేరా అనేది తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వెల్లడించారు.
గత ప్రభుత్వాల హయంలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులకు దామాషా ఆధారంగా ఎస్సీ కులాల రిజర్వేషన్ ఉండేది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ కులాల కు ఎటువంటి రిజర్వేషన్ లేకుండా తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎస్సీ కులాల రైతులకు పంట రుణాలు ద్వారా బ్యాంకుల వద్ద రుణాలు పొందిన దాఖలాలు ఉన్నాయి. అట్టి రుణాలను ప్రజాపాలన ప్రభుత్వం కాంక్షలు లేకుండా ఎస్సీ రైతులకు రుణమాఫీ వర్తింపచేయాలని కోరారు. ఎస్సీ రైతులకు కొత్త రుణాలు మాన్యువల్ పహానిలపై ఎస్సీ రైతులకు కొత్త రుణాలు ప్రవేశపెట్టాలని తెలియజేశారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల నిరుద్యోగులు, నిరుపేదలైనప్పటికీ స్థానిక ఉద్యోగ, ఉపాధికి అర్హులు కారని ప్రభుత్వాలు హేళన చేయడమేనని ఖండించారు. ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాలు అధికంగా ఇల్లు లేక, ఇంటి స్థలం లేనివారు పేదలైనప్పటికీ ఇల్లు మంజూరు చేయటానికి ప్రభుత్వాలు ఆంక్షలు విధించి అనాధలుగా అభివృద్ధిపై వివక్షత చూపుతున్నారని ఖండించారు.నేటి నుండి జరగబోయే తెలంగాణ రాష్ట్ర వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల సమస్యపై పాలక పక్షం, ప్రతిపక్షం ప్రస్తావించి న్యాయం చేయాలని కోరారు. సమావేశంలో షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర, జిల్లా నాయకులు ఎనగంటి కృపాకర్, కండె రాములు, నాగేశ్వరరావు, రమణయ్య, తిరుమలరావు, జిల్లా మహిళా నాయకురాలు పార్వతి, బోడ ముత్తయ్య సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now