ముదిరాజులకు తీరని అన్యాయం చేస్తున్న పాలకులు
- ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్
హనుమకొండ జిల్లా ప్రశ్న ఆయుధం
ప్రభుత్వాలు మారిన పాలకుల తీరు మారడం లేదని ముదిరాజ్ కులస్తులకు తీరని అన్యాయం చేస్తున్నారని ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు మండల తాసిల్దార్ జగన్మోహన్ రెడ్డికి ముదిరాజ్ కులస్తులు బీసీడీ నుంచి బీసీఏ మార్చాలని వినీతిపత్రాన్ని ఇచ్చారు. అనంతరం పల్లెబోయిన అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ముదిరాజ్ కులస్తుల కష్టాలు తీరడం లేదు ఇబ్బందులు మారడం లేదన్నారు. ప్రభుత్వం వెంటనే బిసి-డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని పల్లెబోయిన అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుంటే రాష్ట్రంలోని ముదిరాజులను ఏకం చేసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అన్నిట్లో ముదిరాజ్ కులస్తులకు అన్యాయం జరుగుతుందని అయినా కూడా ప్రభుత్వం గుర్తించడం లేదన్నారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవచూపి ముదిరాజ్ కులస్తులను బిసి నుంచి బీసీఏలోకి మార్చాలని పల్లెబోయిన అశోక్ కోరారు. అలాగే చెరువులను పూర్తిస్థాయిలో మరమతులు చేసి నాణ్యమైన చేప పిల్లలను అందించాలన్నారు. గత ప్రభుత్వమే నాసిరకం చే పిల్లల అందించడం వల్ల ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వమైనా నాణ్యమైన చేప పిల్లల అందించి ముదిరాజ్ కులస్తులకు ఉపాధి కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై విభాగము రాష్ట్ర కన్వీనర్ శాష బోయిన రాజ్ కుమార్, వరంగల్ జిల్లా మత్స్యశాఖ అధ్యక్షులు బుస్సా మల్లేశం, ఆత్మకూరు మత్స్యశాఖ చైర్మన్ బయ్య తిరుపతి,బండి సారంగపాణి, బయ్య కుమారస్వామి, గుండెబోయిన శ్యామ్, భాష బోయిన సాగర్, డాక్టర్ పైడి, భాష బోయిన సదానందం, సొసైటీ డైరెక్టర్ వెంకట్ రమణ, భయ్యా రాజు, తదితరులు పాల్గొన్నారు