అధికారుల జొక్యము లేకనే దళారుల చేతుల్లో మోసపోతున్న అమాయక ఆదివాసి రైతులు.

ఆదివాసి సంఘం డివిజన్ నాయకుల డిమాండ్.ఈరోజు దుమ్ముగూడెం మండల పరిషత్ కార్యాలయం పరిధిలో ఏర్పాటు అయిన అత్యవసర సమావేశంలో డివిజన్ అధ్యక్షుడు సోందె మల్లుదొర మాట్లాడుతూ మండలం వ్యాప్తంగా ఆదివాసి రైతులను ఇతర బడుగు బలహీన వర్గాల రైతుల పంటను దళారులు దోచుకునే విధానాన్ని పండించిన పంటను అక్రమ ధరకు కొనే విధానాన్ని అరికట్టడం లో మండల అధికారులు విపలమౌతున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ నిబంధనలను అతిక్రమించి కొందరూ దళారులు మార్కెటింగ్ లైసెన్స్ లేకున్నా విచ్చలవిడిగా కంటా తేడాలతో ఆదివాసి రైతులను బడుగు బలహీన వర్గాల రైతులను మోసం చేస్తూ రైతులు పంటలను కొనుగోలు చేసే తరుణం కనిపిస్తా ఉన్నది అయినా మండల ఏవో ఏఈవోలు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అని అగ్రహారం వ్యక్తపరిచారు ఆదివాసిల ప్రాంతాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేసే రైట్స్ దళారులకు ఉన్నాయా సమాధానం చెప్పాలని అధికారులను ప్రశ్నించారు కొందరు రైతులు ఆరుగారం కష్టపడి తిని తినక పంటలను కాపాడి పండిస్తే ఆఖరికి కొందరి అక్రమ దళారులు చే అత్యవసరంగా అవసరం కోసం పంటలు అమ్ముకోవడానికి చేస్తే కాట విషయంలో ఆదివాసి రైతులు బడుగు బలహీనవర్గాల రైతులు మోసపోవాల్సిన పరిస్థితి కనపడుతుందని ఆగ్రహించారు అడ్డగోలుగా ఎవరికి పడితే వారికి అనార్హులకి ఏ వో పెర్టిలైజర్ దుకాణాలు నడపడానికి అనుమతులు ఇచ్చేసి ఆదివాసీ గ్రామాలలో రైతుల పంటలను అడ్డుగోడలు ధరలకు కొనుగోలు చేసుకోడానికి ప్రోత్సాహిస్తున్నారని అనుమానాలు వ్యక్తపరిచారు మండలంలో ఏ సెక్టార్లో ఆ సెక్టార్లలో పనిచేస్తున్న ఏఈఓ లోచే రైతుల పంటను అమ్మే విషయంలో కొందరు దళారులు కాట విషయంలో చేస్తున్న మోసాన్ని అరికట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేకుంటే ఆదివాసి సంఘం ద్వారా ఆదివాసి గ్రామాలలో కొనుగోలు చేయడానికి వచ్చిన మార్కెటింగ్ లైసెన్స్ లేని దళారులను తరిమి కొడతామని హెచ్చరించారు. దీనికి బాధ్యత అధికారులే వహించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా గ్రామాలలో పండించిన పంటలను కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల పంటలను( పత్తి ధాన్యం)ప్రభుత్వం గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసి తత్వరిగా రైతులకు సొమ్ము చెలించాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో నాయకులు రేసు ఆదినారాయణమూర్తి కూరం బొర్రయ్య కారం గోపాల్ కుర్సం చెన్నయ్య మోహన్ రామ చిట్టి తదితరులు.

Join WhatsApp

Join Now

Leave a Comment