తెలంగాణ మోడల్ స్కూల్ ను ఆకస్మికంగా సందర్శించిన

తెలంగాణ
Headlines in Telugu
  1. తెలంగాణ మోడల్ స్కూల్ ఆకస్మిక తనిఖీ
  2. మధ్యాహ్న భోజనంపై విద్యాశాఖ అధికారి సూచనలు
  3. నాస్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయండి: బట్టు రాజేశ్వర్
  4. పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు చేపట్టాలి
  5. ఉపాధ్యాయుల బోధన తీరుపై సమీక్ష

మండల విద్యాశాఖ అధికారి– బట్టు రాజేశ్వర్

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గల తెలంగాణ మోడల్ స్కూల్ పాఠశాలను, బాల్కొండ మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఆకస్మికంగా గురువారం రోజున తనిఖీ చేయడం జరిగింది. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడం జరిగింది. విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం ని అందించాలని, మధ్యాహ్న భోజన ఏజెన్సీ కి సూచించారు.

తెలంగాణ మోడల్ స్కూల్ లో లెర్నింగ్,ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రాం, ఉపాధ్యాయుల బోధన తీరును పరిశీలించి, ఆన్లైన్లో నమోదు చేయడం జరిగిందని తెలిపారు. నాస్ పరీక్ష పేపర్లను పరిశీలించారు. నాస్ పరీక్షకు 6వ, 9వ తరగతి విద్యార్థులను సిద్ధం చేయాలని మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కు , ఉపాధ్యాయుల బృందం కు సూచించారు. పదవ తరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారి బట్టురాజేశ్వర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో. ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment