“పిట్లం మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు కేంద్రాల తనిఖీ”
“రైతులకు తేమ శాతం విషయంలో కీలక సూచనలు”
కామారెడ్డి జిల్లా పీట్లం ప్రశ్న ఆయుధం నవంబర్ 03:
పిట్లం మార్కెట్ యార్డులో ఆదివారం డిస్ట్రిక్ కోపరేటివ్ ఆఫీసర్ రామ్మోహన్ ఆదివారం వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స తేమశాతాన్ని పరిశీలించారు. వడ్ల తేమ శాతం 17% ఉండే విధంగా రైతులు చూసుకోవాలని తెలిపారు. ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని, రైతులు అధైర్య పడోద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శపథం రెడ్డి, ప్లాస్టర్ ఆఫీసర్ మురళి, సెక్రెటరీ సంతోష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.