జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు రహదారి పరిశీలన 

జోనల్ కమిషనర్ ఆదేశాల మేరకు రహదారి పరిశీలన

ప్రశ్న ఆయుధం నవంబర్ 29: శేరి లింగంపల్లి ప్రతినిధి 

శేరిలింగంపల్లి జోన్ శేరిలింగంపల్లి సర్కిల్ నల్లగండ్ల హుడా లే ఔట్ కాలనీవాసుల విజ్ఞప్తి మేరకు రాక్ గార్డెన్ రహదారిని పరిశీలించాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు శుక్రవారం సర్కిల్ ఇంజనీర్ విభాగానికి చెందిన అధికారుల బృందం రోడ్డును పరిశీలించింది. శేరిలింగంపల్లి సర్కిల్ డీఈ విలాక్షి ఆధ్వర్యంలోని ఇంజినీరింగ్ విభాగపు అధికారులు రహదారి స్థితిగతులను అంచనా వేశారు. ఈ సందర్భంగా స్థానిక కాలనీవాసులు రోడ్డు దెబ్బతినడం, రహదారి మధ్యలో మట్టి వల్ల పడుతున్న సమస్యలను వారు సదరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హుడా కాలనీ లే ఔట్ రహదారి 100 ఫిట్ల రోడ్డు అయినప్పటికీ.. రహదారి సరిగా లేకపోవడం వల్ల ఎదురవుతున్న సమస్యలను ఇంజినీరింగ్ బృందానికి తెలియజేశారు. ఈ సందర్భంగా డీఈ విలాక్షి మాట్లాడుతూ..రాక్ గార్డెన్ రహదారి మరమ్మత్తులపై జడ్సీ ఉపేందర్ రెడ్డి ప్రత్యేక కేర్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ విలాక్షితో పాటు ఏఈ రషీద్,వర్క్ ఇన్స్ పెక్టర్ లక్ష్మణ్,నల్లగండ్ల హడా కాలనీవాసులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment