మత్తు బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలి…ఇన్స్పెక్టర్ బానోతు సైదా 

మత్తు బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలి

* గజ్వేల్ పోలీస్ ఇన్స్పెక్టర్ బానోతు సైదా

మత్తు భారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని గజ్వేల్ పోలీస్ ఇన్స్పెక్టర్ బానోతు సైదా పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గజ్వేల్ పొలీస్ స్టేషన్లో సిఐ సైదా ఆధ్వర్యంలో గురువారం యువకులకు గంజాయి, యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దన సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలను నడపవద్దని కోరి ప్రమాదాలను తెచ్చుకోవద్దని సూచించారు. రోడ్డుపై వాహనాలను నడిపే సమయంలో వాహనదారులు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని అవగాహన కల్పించారు.

Join WhatsApp

Join Now