Site icon PRASHNA AYUDHAM

ఇన్స్పైర్ మనక్ ను ప్రారంభించిన అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
జిల్లాస్థాయి ఇన్స్పైర్ మనక్ 20 23 ను అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించారు. విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వo నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనక్ ప్రతి సంవత్సరం ఆన్లైన్ ద్వారా విద్యార్థుల నుండి నమోదునుసేకరించి వారు తెచ్చిన ప్రాజెక్టుల నుండి జిల్లాకు ఎంపికైన వాటికి ఒక్కో విద్యార్థికి పదివేల చొప్పున ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది ఆ సహకారంతో విద్యార్థులు ప్రాజెక్ట్ ను తయారు చేసి జిల్లా స్థాయిలో ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శన అన్నపురెడ్డిపల్లి లోని ప్రాథమిక పాఠశాలలో నేడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభించి మాట్లాడారు గతం కన్నా మెరుగైన ప్రాజెక్టులు ఇక్కడకు విద్యార్థులు తీసుకువచ్చారని వీటి నుండి రాష్ట్రస్థాయికి కేంద్ర స్థాయికి ఎంపిక కావాలని శాస్త్రీయ జ్ఞానాన్ని పెంపొందించుకోవడం ద్వారానే మనం అభివృద్ధి చెందగలుగుతామని ఆయన అన్నారు. డీఈవో వెంకటేశ్వర చారి మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన ప్రాజెక్టుల నుండి ఎనిమిది ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామని అక్కడి నుండి కేంద్ర స్థాయికి ఎంపిక అవుతాయని, కేంద్రంలో ఎంపికైన ప్రాజెక్టులకు అభివృద్ధి పరచుకునేందుకు లక్ష రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. సమాజానికి ఉపయోగపడే ఇన్నోవేషన్స్ ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్ ఐ ఎఫ్ పరిశీలకులు సుకృత్, న్యాయ నిర్ణేతలు మాధవి, జగన్మోహన రాజు, ప్రిన్సిపాల్ బురాన్, ఎంఈఓ లు లక్ష్మీ, ఆనంద కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు సెమినార్
18వ తేదీ నుండి జరుగుతున్న జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలో భాగంగా ప్రదర్శనలు తీసుకొచ్చిన విద్యార్థుల కోసం వికసిత భారత్ అనే అంశంపై సదస్సునిర్వహించారు.

ఈ సదస్సులో పాల్గొన్నవిద్యార్థుల నుండి ప్రధమ,ద్వితీయ,తృతీయ స్థాయిలను ఎంపిక చేసి వారికి బహుమతులను పంపిణీ చేశారు ప్రాజెక్టులు తెచ్చిన విద్యార్థులు తమ ప్రాజెక్టుల పై ప్రసంగించారు ఈ సదస్సు ద్వారా ప్రతీ విద్యార్థి కొత్త విషయాన్ని నేర్చుకుంటాడని తద్వారా వారి పాఠశాలలోని ప్రతి విద్యార్థికి ఈ విషయాన్ని చేరవేస్తారని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు.
మానవ మనుగడకు మూలం శాస్త్రీయత అంశంపై అతిధులతో సంతకాల సేకరణ చేశారు సాయంత్రం అధికారులు విద్యార్థులతో క్యాంప్ ఫైర్ ని నిర్వహిస్తున్నామని అన్నారు.

Exit mobile version