విగ్రహ ప్రతిష్టాపన

శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి
ప్రశ్న ఆయుధం జూలై 24 : శేరి లింగంపల్లి ప్రతినిధి

శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపనపల్లి గ్రామం లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో ఈరోజు గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ సంస్కృతిలలో సప్తమాతృకలైన అమ్మవార్లను పూజించడం భాగమని, అమ్మవారిని పూజించడం ద్వారా చీడపీడలు తొలగి ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవిస్తారని ప్రజల నమ్మకం అన్నారు. పోచమ్మ తల్లి దీవెనలు ప్రజలందరిపై తప్పక ఉంటాయన్నారు. గచ్చిబౌలి డివిజన్ వ్యాప్తంగా పురాతన ఆలయాలను జీర్ణోద్ధరణ చేయడంతోపాటు, నూతన ఆలయాల నిర్మాణాలకు తన సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పోచమ్మ టెంపుల్ కమిటీ ప్రెసిడెంట్ జితేందర్,ట్రెజరర్ ప్రభాకర్,జనరల్ సెక్రెటరీ నరసింహులు,జాయింట్ సెక్రెటరీ రాములు,ఆర్గనైజింగ్ సెక్రటరీ బాలరాజు,రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు, శేఖర్,ప్రభాకర్,రమేష్,రంగస్వామి,విష్ణు,సురేష్,శంకర్,చిన్న, నర్సింగ్ రావు,శ్రీకాంత్,మధు,నరసింహా,గోవర్ధన్, బిక్షపతి,మహేష్, శ్రీశైలం,సింధు,వెంకటేష్,రాజు,సత్య,శ్రీకాంత్,రాజేష్,రామకృష్ణ,కుమార్, గిరి,సుమన్, మణికంఠ, స్థానిక నేతలు, దేవాలయ కమిటీ సభ్యులు,భక్తులు,కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now