మహానీయుడు అంబేద్కర్ ను అవమానించడమంటే మాతృ దేశాన్ని అవమానించినట్లే.

మహానీయుడు అంబేద్కర్ ను అవమానించడమంటే మాతృ దేశాన్ని అవమానించినట్లే.

ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్.

కోరుట్ల డిసెంబర్ 19ప్రశ్న ఆయుధం

భారత రాజ్యాంగ నిర్మాత విశ్వరత్న బాబాసాహెబ్ బి ఆర్ అంబేద్కర్ గారిని రాజ్యసభలో జరిగిన రాజ్యాంగ వజ్రోత్సవాల చర్చల్లో ప్రతిపక్షాలపై వున్న ఈర్ష్య ను అంబేద్కర్ పై చూపడం కేంద్ర హోంశాఖ మంత్రి గా అమిత్ షా కు తగదని తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పేట భాస్కర్ పేర్కొన్నారు.

గురువారం కోరుట్లలోని తన కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై వున్న అక్కసుతో అంబేద్కర్ గారిని అవమానించారని దేశమంతా అంబేద్కర్ యిజం అవసరమని దేశం కోసం ఆయన చేసిన త్యాగాలకు ఎవరు సరిపోరని హిందువులు గా తమ దైవాన్ని కోలవడంలో ప్రతి హిందువు బాధ్యత గా వున్నారని స్వర్గం నరకం దేవుడి నిర్ణయం అని మీరు ప్రత్యేకించి అంబేద్కర్ నామస్మరణ పై మాట్లాడం సబాబుగా లేదని మరోసారి అలాంటి విమర్శలు చేస్తే దేశం క్షమించబోదని పేట భాస్కర్ ఆవేదన వ్యక్తంచేశారు.

ఈసమావేశంలో నాయకులు శనిగారపు రాజేష్, బద్ది ఆనంద్ లు వున్నారు.

Join WhatsApp

Join Now