భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ లేబర్ బోర్డే ఇవ్వాలి ..

భవన నిర్మాణ కార్మికుల ఇన్సూరెన్స్ లేబర్ బోర్డే ఇవ్వాలి 

లేబర్ కమిషన్ ను కోరిన జై స్వరాజ్ పార్టీ 

IMG 20241009 WA0072

భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కమిషన్ ఇచ్చే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను యథాతథంగా కొనసాగించాలని జై స్వరాజ్ పార్టీ అధినేత కాసాని శ్రీనివాసరావు గౌడ డిమాండ్ చేశారు. జై స్వరాజ్ పార్టీ ట్రేడ్ యూనియన్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు గోలుకొండ రత్నం, రాష్ట్ర కార్యదర్శి మాటూరి కృష్ణ మోహన్, మౌలాలి హౌసింగ్ బోర్డు కమిటీ అధ్యక్షుడు ఇంజ గణేష్ లతో కలిసి ఆయన ఈ రోజు హైదరాబాదులోని లేబర్ డిపార్ట్మెంట్ అదనపు కమిషనర్ గంగాధర్ కు వినతి పత్రం అందజేశారు. భవన నిర్మాణ కార్మికులకు సహజ మరణం, ప్రమాదవశాత్తు మరణం, పాక్షిక అంగవైకల్యం, శాశ్వత వైకల్యం వంటి నాలుగు రకాల ఇన్సూరెన్స్ క్లెయిమ్ లను ఇప్పటి వరకు లేబర్ కమిషన్ పరిధిలోని లేబర్ వెల్ఫేర్ బోర్డు ద్వారానే ఇస్తున్నారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ఇప్పించేందుకు ఇటీవల టెండర్లు పిలిచింది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని అడిషనల్ కమిషనర్ గంగాధర్ కు జై స్వరాజ్ పార్టీ అధినేత కేఎస్ఆర్ గౌడ వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని ఆయన జై స్వరాజ్ పార్టీ నాయకులకు హామీ ఇచ్చారు.

Join WhatsApp

Join Now