ప్రజా పాలన దినోత్సవ వేడుకకు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయం
ప్రశ్న ఆయుధం, సెప్టెంబర్ 16, కామారెడ్డి :
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన ప్రజాపాలన దినోత్సవ వేడుకకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం ముస్తాబు అయింది. మంగళవారం నిర్వహించనున్న ప్రజాపాలన దినోత్సవ వేడుకల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, ఉదయం 10.00 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరరించిన అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, అధికారులు, ప్రజలు విచ్చేయనున్న నేపథ్యంలో ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వేదిక, ఆహూతులకు సిటింగ్ ఏర్పాట్లు, తదితర వాటి గురించి సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారు.