ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం

ప్రభుత్వ
Headlines :
  1. పేద విద్యార్థుల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాలలు నిర్మాణం
  2. తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌తో విద్యా విప్లవం
  3. కస్తూర్బా పాఠశాలలో వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు
  4. పటేల్ రమేష్ రెడ్డి దత్తత: పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
  5. తెలంగాణలో పేద విద్యార్థులకు విద్యా సాధికారత కోసం కొత్త ప్రణాళికలు

ఇరవై ఐదు ఎకరాలలో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ల నిర్మాణం

పేద విద్యార్థులు చదివే గురుకుల పాఠశాలలో అన్ని రకాల వసతులు, నాణ్యతగల రుచికరమైన భోజనం అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి

 పాఠశాలలో మెరుగైన వసతులు, రుచికరమైన, నాణ్యతగల భోజనం అందించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట కస్తూర్బా గాంధీ మైనారిటి గురుకుల పాఠశాలను రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యులు చారుగొండ వెంకటేష్ తో కలిసి ఆయన సందర్శించి అక్కడ బాలికలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. పాఠశాలలో పరిశుభ్రత పాటిస్తున్న సిబ్బంది కి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఇచ్చే మెస్ చార్జిలను ,కాస్మొటిక్ చార్జిలను పెంచారని, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇరవై ఎకరాలలో పేద విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. తాను కస్తూర్బ మైనారిటి పాఠశాలను దత్తత తీసుకొని పాఠశాల అభివృద్ధి కోసం తనవంతుగా సహాయం అందింస్తున్నట్లు చెప్పారు. స్ప్రెడ్ ఇండియా- సువెన్ ఫార్మా సహకారంతో ఏడు లక్షల రూపాయల వ్యయంతో పాఠశాలకు ప్రహారి గోడ నిర్మాణం చేస్తామని చెప్పారు. పాఠశాల లో తరగతి గదుల కొరత వుందని, కోటి ఇరవై లక్షల రూపాయల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ రూపొందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా  పాఠశాలలో తరగతి గదులను, వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా బిసి సంక్షేమ అధికారి గామయ్య, ఎస్ సి సంక్షేమ అధికారి లత, ఎస్ టి సంక్షేమ అధికారి రమేష్ నాయక్, డిఇవొ అశోక్, గురుకుల పాఠశాల స్పెషల్ ఇంఛార్జ్ నారాయణమ్మ, డిసిడివొ పూలన్, కౌన్సిలర్ లు మహమ్మద్ షఫి, వెలుగు వెంకన్న, రామ్మూర్తి యాదవ్, రమేష్ నాయుడు, ధర్మా నాయక్, వల్దాసు దేవేందర్ , నిమ్మల వెంకన్న, యాట ఉపేందర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now