ముమ్మరంగా వాహన తనిఖీలు…

ముమ్మరంగా వాహన తనిఖిలు

-ఎస్సై మోహన్ బాన్స్వాడ

ప్రశ్న ఆయుధం న్యూస్ బాన్స్వాడ-22

కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణ పరిధిలోని బుడ్మి చౌరస్తా వద్ద ఈరోజు ఎస్సై మోహన్ కానిస్టేబుల్ ల ఆధ్వర్యం లో వాహన తనిఖిలు చెప్పట్టడం జరిగింది.
వాహనాలకు నెంబర్ ప్లేట్,హెల్మెట్,బండి పత్రాలు,ఇన్స్సూరెన్స్,లైసెన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకున్నారు.
సరి అయిన పత్రాలు,హెల్మెట్ లేని వాహనదారులకు తగు పెనాల్టీలు వేయడం జరిగింది.
అలాగే వాహనదారులకు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహనా చేయడం జరిగింది.
నెంబర్ ప్లేట్ లేని వాహనదారులకు పెనాల్టి వేయకుండా అక్కడే వారి వాహనానికి నెంబర్ ప్లేట్ లను వేయించడం జరిగింది. పాత పెనాల్టీలు ఉంటే వాటిని కటించుకోవడం జరిగింది. హెల్మెట్ లేని వారికి వారి ఫోన్ ద్వారానే ఆన్లైన్ లో బుక్ చేయించడం జరిగింది. అందుకు వాహన దారులు ఎస్సై ని అభినందించారు.
కాని సాయంత్రం సమయం లో సామాన్య వ్యవసాయ రైతులు,ప్రజలు వారి వారి ఇంటికి చేరుకునే సమయం. అలాంటి సమయం లో ఇలా ప్రతి రోజు గంటల తరబడి వాహన తనిఖిలు చేయడం ఇబ్బందిగా ఉంది అని ప్రజలు,రైతులు అన్నారు.
అయితే ఎస్సై మోహన్ ను వివరణ కోరగా పై అధికారుల ఆదేశాల మేరకు తనిఖిలు చెప్పట్టడం జరుగుతుంది అని అన్నారు. ఇ తనిఖిల వాళ్ళ వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు. ఇలా రోజు తనిఖిలు చేయడం వాళ్ళ నైన హెల్మెట్,ఇన్సూరెన్స్,లైసెన్స్,నెంబర్ ప్లేట్ అన్ని వెంట తీసుకొని వెళ్ళాలి అనేది గుర్తు చేసిన వారం అయితము తప్ప వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అన్నారు.

Join WhatsApp

Join Now