గురుకులాల్లో ఇంటర్‌ ఇంగ్లిష్‌ మీడియం..

*గురుకులాల్లో ఇంటర్‌ ఇంగ్లిష్‌ మీడియం..*

ప్రవేశాలకు ఆర్‌జేసీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 తెలంగాణ గురుకుల రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికిగానూ ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆర్‌జేసీసెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. తాజా నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 24 నుంచి ఆర్‌జేసీసెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌ 23వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. గురుకుల జూనియర్‌ కాలేజీల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదవాలనుకునేవారు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందొచ్చు. ఆసక్తి కలిగిన వారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మరిన్ని వివరాలకు 040-24734899 ఫోన్ నంబరుకు పని వేళల్లో ఫోన్ చేసి సమాచారం పొందొచ్చని సంస్థ పేర్కొంది.

ఐటీఐ 60 శాతం మార్కులతో పాసైన విద్యార్థులు లేటరల్‌ ఎంట్రీ ఇంటూ పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఎల్‌పీసెట్‌-2025) ద్వారా పాలిటెక్నిక్‌ డిప్లొమాలో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశానికి రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ మార్చి 21 నుంచి ప్రారంభమైనాయి. ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్‌ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. మే 20న ప్రవేశ పరీక్ష ఉంటుంది.

Join WhatsApp

Join Now