ఇంటర్ ఫలితాలు విడుదల.

*ఇంటర్ ఫలితాలు విడుదల..*

*హైదరాబాద్*

ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్ (1st year)..సెకండ్ ఈయర్ (2nd year) ఫలితాలను (Results) డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో విడుదల చేశారు. విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఇంటర్ మొదటి , రెండవ సంవత్సరానికి మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలు విడుదల చేసిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఇంటర్ ఫలితాలకోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కాలు తెలియజేశారు. ఇంటర్ మొదటి , రెండవ సంవత్సరానికి మొత్తం విద్యార్థులు 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే పాస్ పర్సంటేజ్ పెరిగిందన్నారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పై చేయి అని అన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా.. ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం బాలికలు పాస్ అయ్యారని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment