పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి  – ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం 

జిల్లాలో 38 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలు 

– పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలి 

– ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం 

ప్రశ్న ఆయుధం – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 38 ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా 2025- 26 సంవత్సరానికి గాను 18472 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఈ సంవత్సరం పరీక్ష రాయనన్నట్లు ఆయన తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో జనరల్ 6828, ఒకేషనల్ 1915 మంది విద్యార్థులు పరీక్ష రాయడానికి వస్తారని, ద్వితీయ సంవత్సరంలో జనరల్ 8339, వృత్తి విద్యా కోర్సుల్లో 1390 మంది విద్యార్థిని విద్యార్థులు పరీక్ష రాస్తారన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 19 మోడల్ కళాశాలలో 10 ప్రైవేట్ కళాశాలలో తొమ్మిది సెంట్రల్ లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. అర్బన్ 20 రూరల్ లో 18 సెంటలలో నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలన్నారు.

విద్యార్థినీ విద్యార్థులు బస్సులో ప్రయాణం ఉచితమే 

( ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం )

ఇతర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకోవడానికి బస్సులో ప్రయాణించే విద్యార్థినిలకు ఆధార్ కార్డు ఉండగా, విద్యార్థులకు బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు అన్నారు. అందుకోసం ఆర్టీసీ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని బస్సులో వచ్చే సమయంలో బస్సు పాస్ తో పాటు హాల్ టికెట్ ను బస్సులోని కండక్టర్కు చూపేచాలని దాంతో సెంటర్ వరకు ఆర్టీసీ బస్సులో ఉచితంగానే ప్రయాణం చేయవచ్చు అన్నారు.

Join WhatsApp

Join Now