*హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివీ ఆనంద్ కు అంతర్జాతీయ అవార్డు*
*హైదరాబాద్:మే 06*
హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను అంతర్జాతీయ అవార్డు లభించింది. డ్రగ్స్ కట్టడిలో కీలకపాత్ర పోషించినందుకు సీవీ ఆనంద్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
దుబాయ్‌లో జరగబోయే అంతర్జాతీయ పోలీస్ సమ్మిట్‌లో సీపీ ఎక్సలెన్స్ ఇన్ యాంటీ నార్కొటిక్స్ అవార్డును అందుకోనున్నా రు. ఈ అవార్డు కోసం మొత్తం 138 దేశాలు పోటీ పడటం విశేషం.
ఇదిలా ఉంటే సీవీ ఆనంద్ నగర సీపీగా వచ్చిన తరవాత డ్రగ్స్ కట్టడిలో కీలకంగా వ్యవహరించారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్స్ పై ఉక్కుపాదం మోపారు. వరుస దాడులు చేస్తూ డ్రగ్స్ కట్టడికి కృషి చేశారు. దీంతో ప్రస్తుతం డ్రగ్స్ కేసులు చాలా వరకు తగ్గాయి.
గంజాయిని నివారించడం లో కూడా సీపీ సఫలం అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయనను అవార్డుకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక గతంలో సీవీ ఆనంద్ అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ గా పనిచేశారు. సైబరాబాద్ కమిషనర్ గా కూడా విధులు నిర్వహించారు.