జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి మరియు వరల్డ్ ఎన్జీవో ఆధ్వర్యం లో అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం దినo సందర్బంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ని గౌరవనీయులైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ డాక్టర్ వి ఆర్ ఆర్ వరప్రసాద్ పచ్చ జెండా ఊపి ఈ ర్యాలీ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ నేటి సమాజములో స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయము, విద్యాపరముగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గృహ హింసలు, స్త్రీలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఆత్మన్యూనతా భావానికిలోనై స్త్రీలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వీటిన్నింటినీ అరికట్టే ప్రయత్నము చేయాలి అన్నారు . ఈ ర్యాలీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు జూనియర్ సివిల్ జడ్జి కే. సుధాకర్ , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీమతి దీక్ష , న్యాయ వాదుల సంగం అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్, జిల్లా కోర్ట్ సూపరింటెండెంట్స్ వెంకట్ రెడ్డి, భుజంగ రావు, శ్రీధర్, V . చంద్రసేన్ రెడ్డి వర్డ్ సభ్యలు రాణి మరియు రమేష్ సిబ్బంది, ISRD NGO, సఖి కేంద్రం, ప్రొఫెసర్ ఆంజనేయులు సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ సౌత్ క్యాంపస్, నాగరాజు HIV డిపార్ట్మెంట్ , SHE టీం సౌజన్య మరియి సిబ్బంది, మహిళా సాధికారత కేంద్రం, అంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ కామారెడ్డి , సాధన NGO,చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది మాయ సురేష్ , డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది మోహన్ రావు కులకర్ణి , న్యాయవాదులు షబానా , నవీన్ ఇతరులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కామారెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.
అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేకదినం
Published On: November 25, 2024 3:07 pm