పాల్వంచలో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే వేడుకలు
బాలిక హక్కులపై అవగాహన
జెండర్ సమానత్వం కోసం పిలుపు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధ) అక్టోబర్ 14
కామారెడ్డి జిల్లా పాల్వంచ,మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయంతో ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే వేడుకలను పాల్వంచ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బాలికల పేర్లతో మొక్కలు నాటారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ టి. నాగరాణి మాట్లాడుతూ బాలికలకు ఉన్న హక్కులు, చట్ట పరిరక్షణల గురించి వివరించారు. న్యాయ పరమైన ఏవైనా అనుమానాలు ఉంటే, వాటిని పరిష్కరించేందుకు తామున్నామని తెలిపారు.
ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ మాట్లాడుతూ, బాల బాలికల మధ్య జెండర్ ఈక్వాలిటీపై అవగాహన అవసరమని, ఆడ పిల్లలకు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. జిల్లా మహిళా సంక్షేమ అధికారి మాట్లాడుతూ బాలికలు భయపడకుండా ఉన్నత విద్య సాధించి, కల్పన చావ్లా, సునీత విలియమ్స్‌లా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో – బేటీ పడావో పథకం కింద విద్యార్థినులకు స్యానిటరీ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఋతుస్రావం పై అవగాహన కల్పించి, గేమ్స్‌లో విజేతలకు బహుమతులు అందించారు. భ్రూణహత్య వ్యతిరేక పోస్టర్ ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఎంఈఓ, సీడీపీఓ రోచిశ్మ, ఎంఆర్ఓ హిమబిందు, అధికారులు, సఖి, బాలరక్ష భవన్, న్యాయ సేవా సమితి సిబ్బంది, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
జిల్లా సంక్షేమ అధికారి
మహిళలు, పిల్లలు, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ.