సంగారెడ్డి/కంది, అక్టోబర్ 11 (ప్రశ్న ఆయుధం న్యూస్): కంది మండలంలోని కాశీపూర్ గ్రామ శివారులోని కేజీబీవీ పాఠశాలలో మంజీరా రోటరీ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పది మంది తల్లిదండ్రులు లేని బాలికలకు కావలసిన సామాగ్రిని పంపిణీ చేశారు. ట్రంకు బాక్సులు, వాటర్ బాటిల్స్, ప్లేట్లు, గ్లాసులు, తాళాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంజీరా రోటరీ క్లబ్ అధ్యక్షుడు కిషన్, కార్యదర్శి సిహెచ్.అంజయ్య, విశ్రాంత మండల విద్యాధికారి, అడ్వకేట్ డి.అంజయ్య, కమలాకర్, రాజు, గొంగులూరు తాండ ప్రధానోపాధ్యాయుడు ప్రవీణ్, కేజీబీవీ పాఠశాల ప్రత్యేక అధికారి మీరాబాయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మంజీరా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలిక దినోత్సవం
Oplus_131072